AP: వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరదల వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరం సమాచారం అందించాలని సూచించారు. సహాయక చర్యల్లో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, పంచాయతీరాజ్ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని పవన్ కళ్యాణ్ తన సిబ్బందికి ఆర్డర్ వేశారు.