వర్షాకాలంలో ఇళ్లలో, ముఖ్యంగా వంటగది, సింక్ దగ్గర చిన్న ఈగలు ఎక్కువగా తిరుగుతుంటాయి. పండ్లు ఎక్కువ రోజులు బయట ఉంచడం, చెత్త బుట్టను ఖాళీ చేయకపోవడం, సింకులో ఆహార అవశేషాలు ఉండటం, తేమ వంటివి ఈగలు పెరగడానికి కారణమవుతాయి. వంట పూర్తయిన వెంటనే కిచెన్, సింక్ శుభ్రం చేయడం, పండ్లను జాగ్రత్తగా ఉంచడం, చెత్త బుట్టకు మూత పెట్టడం, నీరు నిల్వ ఉండకుండా చూడటం వంటి పరిశుభ్రత అలవాట్లతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కిటికీలకు జాలీలు వాడటం మంచిది. ఈ జాగ్రత్తల వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు.