AP: తిరుపతిలోని తిరుచానూరులో
వైసీపీ,
టీడీపీ మధ్య బ్యానర్ల ఏర్పాటు విషయంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా
వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే, ప్రస్తుతం పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు జరుగుతున్నందున, ఎలాంటి రాజకీయ బ్యానర్లు ఏర్పాటు చేయరాదని పోలీసులు ముందస్తు ఆంక్షలు విధించారు.