గణేశ్‌ నిమజ్జనంలో.. రప్పా.. రప్పా అంటూ ఫ్లెక్సీలు

30465చూసినవారు
AP: గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడులో రెడ్డి యువత ఆధ్వర్యంలో రెడ్ల రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడికి నిమజ్జన వేడుక శనివారం నిర్వహించారు. వేడుక మొత్తం వైసీపీ పాటలతో సాగింది. 2029లో రప్పా.. రప్పా.. అని జగన్‌ చిత్రంతో ఉన్న ఫ్లెక్సీ, హెచ్చరిస్తున్నా.. గుర్తు పెట్టుకోండి అంటూ జగన్‌ వేలు చూపిస్తున్న ఫ్లెక్సీలు పట్టుకుని వైసీపీ కార్యకర్తలు హల్‌చల్‌ చేశారు. పోలీసులు ఆ ఫ్లెక్సీలు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :