AP: పల్నాడు జిల్లా వినుకొండ, పిడుగురాళ్ల పట్టణాల్లో తిరుమలలో నెయ్యి కల్తీ అంశంపై ఫ్లెక్సీలు వెలిశాయి. ‘మహా పాపం నిజం’ అనే శీర్షికతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో, తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎస్ఐటీ నివేదికలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు. ఈ ఫ్లెక్సీలు ప్రజల్లో చర్చకు దారితీయగా, భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.