సక్సెస్ ఓర్వలేకే ఫ్లెక్సీలు చింపేశారు: వైసీపీ (వీడియో)

22చూసినవారు
AP: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు సూపర్ సక్సెస్ అయ్యిందని, దాన్ని ఓర్వలేకే టీడీపీ నేతలు ఫ్లెక్సీలు చింపేశారని వైసీపీ ఆరోపించింది. శనివారం ఎక్స్ వేదికగా.. ‘నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు సూపర్ సక్సెస్ అయింది. అది ఓర్వలేక టీడీపీ నేతలు వైసీపీ ఫ్లెక్సీలు చింపేశారు. ప్రశాంతి రెడ్డి అనుచరులు, కోవూరు టీడీపీ మండల టౌన్ అధ్యక్షుడు మల్లారెడ్డి దగ్గరుండి ఫ్లెక్సీలు ధ్వంసం చేయించారు. ఇంత చిల్లర రాజకీయాలా?’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్