AP: అమెరికాలోని ఒమాహా నగరంలో నివసిస్తున్న బాపట్ల జిల్లాకు చెందిన దొప్పలపూడి వెంకటేశ్ భారీ వర్షాలు, వరదల కారణంగా కాన్సాస్ రాష్ట్రంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో, కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లకు లేఖలు రాశారు. గాలింపు చర్యలు చేపట్టాలని,
అమెరికా రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు.