ఏపీలో కొత్త పింఛన్ల కోసం 10 కేటగిరీల్లో 13.65 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 6.88 లక్షల వృద్ధాప్య, 2.97 లక్షల వితంతు, 1.81 లక్షల దివ్యాంగ, 21,565 చేనేత పింఛన్ల దరఖాస్తులున్నాయి. కల్లుగీత కార్మికుల నుంచి 16,430, మత్స్యకారుల నుంచి 31,825, ఒంటరి మహిళల నుంచి 9,201, డప్పు కళాకారుల నుంచి 50,972, చర్మకారుల నుంచి 67,853, హిజ్రాల కేటగిరీలో 800 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఐదు కేటగిరీలకు సంబంధించి 1.42 లక్షల మందిని అనర్హులుగా గుర్తించారు. ఈ దరఖాస్తులను రాష్ట్రస్థాయిలో అధికారులు మరోమారు బ్యాక్ ఎండ్ లోనూ తనిఖీ చేయనున్నారు.