AP: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాల కారణంగా ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 11.60 అడుగులకు చేరుకుని మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో ఉంది. 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భారీ నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని 175 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం 9,62,000 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.