రాజమహేంద్రవరంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద పోటెత్తింది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరడంతో.. మొత్తం 175 గేట్లను ఎత్తి 2.25 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని దేవీపట్నంలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గండిపోచమ్మ అమ్మవారి ఆలయం గోపురం వరకు వరద నీరు చేరింది. వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.