మంచు కరిగి హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు (వీడియో)

8417చూసినవారు
హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు కరగడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా లాహౌల్ లోయలో కీలకమైన మనాలి-లేహ్ జాతీయ రహదారి దెబ్బతినగా, ఉదయ్‌పూర్, మాయర్ లోయలకు రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయింది. వరదల ధాటికి అనేక వంతెనలు, రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు రాకపోకల కోసం తాత్కాలిక ఇనుప వంతెనలను ఏర్పాటు చేసుకుని ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేసి, దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్