AP: భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇప్పటికే 44.9 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పరిస్థితిని అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలోకి 9.88 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, అదే స్థాయిలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం 11 నుంచి 12 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.