AP: కృష్ణా, గోదావరి నదులకు వరద తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,71,263 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12,05,753 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.