ఆక్వా రైతులకు మేత ధరల షాక్: పెట్టుబడులు పెరిగే ఆందోళన

2987చూసినవారు
ఆక్వా రైతులకు మేత ధరల షాక్: పెట్టుబడులు పెరిగే ఆందోళన
ఆక్వా రైతులకు ఫీడ్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. మూడు నెలల్లో రెండోసారి మేత ధరలు పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వనామీ రకం మేత కిలోకు రూ.10, టైగర్ ప్రాన్ మేత కిలోకు రూ.12 పెరిగింది. ఈ ధరల పెంపుతో 25 కేజీల వనామి మేత బస్తా రూ.2,793, టైగర్ మేత బస్తా రూ.3,088కు చేరింది. ఇప్పటికే రొయ్యల ధరలు పడిపోవడం, అమెరికా టారిఫ్, ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావంతో నష్టపోతున్న రైతులకు ఈ ధరల పెంపు మరింత భారంగా మారింది. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై రైతులు నిరసనలకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత పోస్ట్