ఈ టిప్స్ పాటిస్తే తలనొప్పి మాయం!

6332చూసినవారు
ఈ టిప్స్ పాటిస్తే తలనొప్పి మాయం!
అనేక కారణాలతో తలనొప్పి వేధిస్తుంటుంది. ఈ సమస్య మొదలు కాగానే మిగతా పనిపై దృష్టి సారించలేం. ముఖ్యంగా నిద్రలేమి, శరీరంలో నీటి కొరత, ఒత్తిడి, ఎక్కువ సేపు గ్యాడ్జెట్లను వాడటం వల్ల తలనొప్పి రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే తగినంత నీరు తాగడం, సమయానికి నిద్రపోవడం, భోజనం చేయడం, ఒత్తిడి తగ్గించుకోవడం, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం వంటివి పాటిస్తే తలనొప్పిని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ తలనొప్పి వస్తే వైద్యులను సంప్రదించాలంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్