అన్నదానం.. గణేశ్ మండపం వద్ద తోపులాట (వీడియో)

7518చూసినవారు
AP: విశాఖ కొబ్బరి తోటలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. అన్నదాన కార్యక్రమంలో భాగంగా 27 రకాల వంటకాలతో అన్నదానం చేయనున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేశారు. దాంతో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో తోపులాట జరిగింది. పలువురు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. దాంతో నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్