ఫుడ్ పాయిజన్.. 13 మంది విద్యార్థినులకు అస్వస్థత

39చూసినవారు
ఫుడ్ పాయిజన్.. 13 మంది విద్యార్థినులకు అస్వస్థత
AP: అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం బాలికల వసతి గృహంలో 13 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో ఓ విద్యార్థిని పుట్టిన రోజు సందర్భంగా కేక్ తినడంతో వారికి ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థినులకు వాంతులు, విరేచనాల రావడంతో రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తరలించారు. చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఏటీడబ్ల్యూఓ తెలిపారు.

సంబంధిత పోస్ట్