మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన ఫుట్‌బాల్ కోచ్!

7396చూసినవారు
మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన ఫుట్‌బాల్ కోచ్!
మహారాష్ట్రలో మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాల్ఘర్ జిల్లా వసాయిలో ఫుట్‌బాల్ శిక్షణా అకాడమీలో చేరిన 17 ఏళ్ల బాలికపై 36 ఏళ్ల కోచ్ అభిజిత్ మెండల్ పదేపదే లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విసిగిపోయిన బాధితురాలు అతనికి దూరంగా ఉండటానికి ప్రయత్నించగా.. నిందితుడు వీడియోలు, ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్