కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. భారత చరిత్రలో ఆదివారం బడ్జెట్ విడుదల కావడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 1999 ఫిబ్రవరి 28న వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో యశ్వంత్ సిన్హా ఆదివారం నాడు బడ్జెట్‌ను సమర్పించారు.