AP: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు, అటవీశాఖ 'ఆపరేషన్ హనుమాన్' పేరుతో పులిని బంధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 200 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. రేపు బెంగళూరు నుంచి నిపుణుల బృందం రంపచోడవరం చేరుకోనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి సంచరిస్తున్న ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.