సీఎంకు లీగల్ నోటీసు పంపిన మాజీ సీఐ తొలగింపు

25982చూసినవారు
సీఎంకు లీగల్ నోటీసు పంపిన మాజీ సీఐ తొలగింపు
AP: కడప జిల్లా పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీసు నుంచి తొలగిస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను తొలగించినట్లు పేర్కొన్నారు. కాగా, ఇటీవల సీఎం చంద్రబాబుకు శంకరయ్య లీగల్ నోటీసులు పంపారు. సీఎం తనపై చేసిన ఆరోపణల వల్ల పరువు నష్టం వాటిల్లిందని నోటీసుల్లో పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన రోజున పులివెందుల సీఐగా శంకరయ్య పని చేశారు.

సంబంధిత పోస్ట్