సిట్ విచారణకు హాజరైన మాజీ సీఎం జగన్ పీఏ

20చూసినవారు
సిట్ విచారణకు హాజరైన మాజీ సీఎం జగన్ పీఏ
AP: విజయవాడలో మద్యం ముడుపుల కేసు దర్యాప్తు వేగవంతం చేసింది. మాజీ సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కె. నాగేశ్వరరెడ్డి సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రెండు రోజుల పాటు విచారించిన అధికారులు పలు బినామీల వివరాలను సేకరించినట్లు సమాచారం. వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్‌రెడ్డిని నాగేశ్వరరెడ్డి బినామీగా గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే నాగేశ్వరరెడ్డికి సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీల వివరాలపై కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్