AP: నేడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న జగన్, భీమవరం చేరుకుని అక్కడి నుంచి పెదఅమిరం వెళ్లనున్నారు. పెదఅమిరంలోని శ్రీ రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్‌లో జరుగుతున్న వివాహ వేడుకలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.