
వైద్యం చేయను.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ డాక్టర్ ఫైర్ (వీడియో)
AP: తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వైద్యం కోసం వచ్చిన మహిళ బంధువులు అభ్యర్థించినా, తాను వైద్యం చేయనని, ఎవరికి చెప్పుకుంటే చెప్పుకోండి అంటూ దురుసుగా సమాధానమిచ్చాడు. ఎమర్జెన్సీ కేసు ఏం కాదని డాక్టర్ అంటుంటే.. ఆమె మెట్లపై నుంచి కళ్లు తిరిగిపడిపోయిందని రోగి తరపు బంధువు అనడం వీడియోలో చూడొచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.




