AP:
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు ఒక రోజు కస్టడీకి తీసుకుని విచారించారు. బాధిత కుటుంబానికి రూ.9 లక్షలు ఇవ్వాలనుకోవడం నిజమేనా అని పోలీసులు ప్రశ్నించారు. తన కుమారుడి స్థానంలో వేరే వ్యక్తి ప్రమాదం చేసినట్లు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారని అడిగారు. అయితే, అప్పలరాజు పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. తన కుమారుడు ప్రమాదం చేసినట్లు తనకు తెలియదని, స్నేహితుడితో కలిసి బుల్లెట్‌పై ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగి ఉంటుందని భావించానని, అందుకే కుమారుడి పేరు చెప్పలేదని ఆయన వెల్లడించారు.