AP: నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్‌ను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ చేసిన రమేశ్‌ను సిట్ అధికారులు తూర్పు ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో 12 గంటలపాటు విచారించారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుతో సంబంధాలపై ఆరా తీశారు. రమేశ్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారు చేశానని జనార్దనరావు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.