AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని 2 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం నిల్వ కేసులో ఇందుకూరుపేట ఎక్సైజ్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ అవసరమని పేర్కొంటూ శనివారం, ఆదివారం వరకు పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయవాది సమక్షంలో గోవర్ధన్‌రెడ్డిని విచారణ జరపాలని నెల్లూరు స్పెషల్ ఎక్సైజ్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.