వైసీపీకి మాజీ మంత్రి కొడాలి నాని గుడ్ బై?

37చూసినవారు
వైసీపీకి మాజీ మంత్రి కొడాలి నాని గుడ్ బై?
AP; కొన్ని రోజులుగా రాజకీయాల్లో పెద్దగా చురుగ్గా లేని మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీని వీడి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల తిరుమలలో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేతో ఆయన కనిపించడం, ఉత్తరాది బీజేపీ నేతలతో సన్నిహిత్యం పెంచుకోవడం ఈ చర్చకు దారితీసింది. రాజకీయ రక్షణ కోసమే ఆయన బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, గతంలో హిందూత్వంపై నాని చేసిన వ్యాఖ్యలు ఆయన చేరికకు అడ్డంకిగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్