మాజీ మంత్రి రోజాకు మతి భ్రమించింది: ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్

0చూసినవారు
మాజీ మంత్రి రోజాకు మతి భ్రమించింది: ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్
AP: నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, మాజీ మంత్రి రోజాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజాకు మతి భ్రమించిందని, తానేమి మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. గతంలో YCP ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రోజా స్వయంగా చెర్లోపల్లి క్వారీలకు అనుమతులు ఇచ్చారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరమని అన్నారు. రోజా ఇటీవల చేసిన రభస రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. అధికారం కోల్పోవడంతో వైఎస్సార్సీపీ నాయకుల్లో సహనం నశించిందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్