వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్?

0చూసినవారు
వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్?
AP: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆయన వైసీపికి రాజీనామా చేసి, బీజేపీ లేదా టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఆయన తిరిగి వైసీపి గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాపు సామాజికవర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాస్, 2019లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గెలిచి 'జైంట్ కిల్లర్'గా పేరు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్