టీడీపీని వీడనున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి!

35చూసినవారు
టీడీపీని వీడనున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి!
టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారంటూ వస్తున్న వార్తలకు అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఫుల్ స్టాప్ పెట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించడం, నారా లోకేష్ అనంతపురం పర్యటనకు దూరంగా ఉండటంతో ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని ప్రభాకర్ చౌదరి ఖండించారు. టీడీపీని వీడాలనే ఆలోచన తనకు లేదని, టీడీపీ కార్యకర్తగా పనిచేశానని, చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్