AP: విశాఖ మేయర్ పదవికి బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి పేర్లను
వైసీపీ పరిశీలిస్తోంది. విశాఖ వంటి పెద్ద నగర మేయర్ పదవికి కేబినెట్ మంత్రి హోదా, అయిదు వేల కోట్ల బడ్జెట్ తో పాలన చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రత్యక్ష
ఎన్నికలు కావడంతో, ప్రత్యర్థి కూటమి అభ్యర్థిని చూశాకే
వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.