AP:
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. బైక్‌తో గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టి, ఆయన మృతికి కారణమైన కుమారుడిని తప్పించేందుకు కుట్రపన్నిన కేసులో సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గత నెల 24న అప్పలరాజుకు కోర్టు రిమాండ్ విధించగా, ఆయన అంపోల్ జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ గురువారం సోంపేట కోర్టులో విచారణకు రానుంది.