బీజేపీలోకి వైసీపీ మాజీ మంత్రులు!

46చూసినవారు
బీజేపీలోకి వైసీపీ మాజీ మంత్రులు!
ఏపీలో తమ బలాన్ని పెంచుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. ఈ క్రమంలో, వైసీపీలోని బలమైన నాయకులను తమవైపు తిప్పుకోవడం ద్వారా కొత్త రాజకీయాలకు తెరతీయాలని యోచిస్తోంది. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, బీజేపీ ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈసారి ఎక్కువ సీట్లను డిమాండ్ చేసే అవకాశం ఉందని, తమ బలాన్ని రెండింతలు, మూడింతలు చేసుకోవాలనే లక్ష్యాలున్నాయని చెబుతున్నారు. జాతీయ రాజకీయాలు ఏపీపై ప్రభావం చూపిస్తే, వైసీపీ నుంచి కొందరు నాయకులు బీజేపీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, రాబోయే రోజుల్లో వైసీపీకి బీజేపీ నుంచి ముప్పు పొంచి ఉందని చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :