వైసీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖరరెడ్డి అరెస్ట్

1చూసినవారు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖరరెడ్డి అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఓ యువకుడి ఆత్మహత్య కేసులో తోపుదుర్తి రాజాను అరెస్ట్ చేసినట్లు సమాచారం. టీడీపీ నేతల ఒత్తిడితో రైల్వే పీఎస్ నుంచి అనంతపురం రూరల్ పీఎస్‌కు కేసు బదిలీ అయింది. తోపుదుర్తి రాజాపై 108 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్