సోషల్ మీడియాలో డాబీ అనే నాలుగు చెవులున్న పిల్లి పిల్ల వీడియోలు, ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ అరుదైన శారీరక ఆకృతిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. జంతు శాస్త్రవేత్తల ప్రకారం, ఇది ఒక అరుదైన జన్యు వల్ల ఏర్పడిందంటున్నారు. తల్లిదండ్రుల నుండి వచ్చే జీన్స్‌లో లోపాలు ఉన్నప్పుడు, గర్భస్థ దశలో కణాల విభజన సరిగ్గా జరగనప్పుడు ఇలాంటి వింత ఆకృతులు ఏర్పడతాయి. అదనంగా ఉన్న ఈ రెండు చెవుల వల్ల పిల్లికి వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పలేమంటన్నారు.