పూజల పేరుతో మోసం.. ఎన్నారై పూజారి అరెస్ట్ (వీడియో)

12152చూసినవారు
పూజలు, పరిహారాలు చేస్తానంటూ నమ్మించి లక్షల రూపాయలు మోసం చేసిన ఎన్నారై పూజారి చామర్తి రామ లచ్చారావును శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రూ.20 లక్షలు మోసం చేయడంతో పాటు చేతబడి చేస్తానని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. అమెరికాలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు సమాచారం రావడంతో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. మరికొందరు బాధితులు ఉన్నట్లు సమాచారం అందడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్