సీబీఐ, ఈడీ అధికారులమని నటిస్తూ మోసాలు: ముగ్గురు అరెస్టు

1509చూసినవారు
సీబీఐ, ఈడీ అధికారులమని నటిస్తూ మోసాలు: ముగ్గురు అరెస్టు
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో సీబీఐ, ఈడీ అధికారులమని చెప్పి డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేసిన ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. జూన్‌లో మదనపల్లికి చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి పేరు పై కేసు నమోదైందని, ఖాతాలో పొరపాటున రూ.48 లక్షలు వచ్చాయని, వెంటనే పంపకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బు కాజేశారు. ఈ క్రమంలో పటాన్‌ ఇంతియాజ్‌ ఖాన్, షేక్ అమీన్, షేక్ ఇర్షాద్ లను అరెస్టు చేసి రూ.32 లక్షలు, ఖాతాలోని రూ.7.65 లక్షలు సీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్