AP: అనంతపురంలోని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్, రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) ఆర్థిక సహకారంతో ఒంటరి మహిళలకు ఆటో డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ జిల్లాల నుంచి ఎంపికైన 23 మంది మహిళలు, తమ కుటుంబాల భవిష్యత్తు కోసం ఈ శిక్షణ పొందుతున్నారు. నిరక్ష్యరాస్యుల నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన 20-46 ఏళ్ల వయస్సు గల వారికి ఈ శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో మహిళపై సుమారు రూ. 4 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.