AP: అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు శుభవార్త ప్రకటించారు. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం తరఫున సీఎం 7 వరాలు ప్రకటించారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామన్నారు. అలాగే ఆర్థిక సబ్సిడీ పథకాన్ని దివ్యాంగులకు మళ్లీ ప్రారంభిస్తామని వెల్లడించారు.