ఉచిత సిలిండ‌ర్‌.. నేటి నుంచే బుకింగ్స్?

5764చూసినవారు
ఉచిత సిలిండ‌ర్‌.. నేటి నుంచే బుకింగ్స్?
ఏపీలో అక్టోబర్ 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమవుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం అక్టోబర్ 24 అంటే గురువారం నుంచే బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 31 నుంచి సిలిండర్ల పంపిణీ మొదలు కానుంది. ప్రతి 4 నెలల వ్యవధిలో ఎప్పుడైనా లబ్ధిదారులు.. ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.