ఒడిశాలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేయాలనే సీఎం మోహన్‌చరణ్ మాఝి గతంలో ప్రకటించిన ప్రతిపాదనకు బుధవారం రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ నిర్ణయం ద్వారా ఏటా 38 లక్షల మంది
విద్యార్థులు ప్రయోజనం పొందుతారని, ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదని సీఎం తెలిపారు. మరో నాలుగేళ్ల పాటు 9, 10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగుతుందని, డ్రాప్ అవుట్లను తగ్గించి, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.