రూ.2.5 లక్షల వరకు అందరికీ ఉచిత వైద్యం: చంద్రబాబు

60చూసినవారు
రూ.2.5 లక్షల వరకు అందరికీ ఉచిత వైద్యం: చంద్రబాబు
AP: పీ4 కింద 500-700 వరకు కుటుంబాలను క్లస్టర్‌గా చేస్తే మార్పు వస్తుందని సీఎం చంద్రబాబు సూచించారు. కుప్పంలోని పీ4 బంగారు కుటుంబాలు-మార్గదర్శులతో శనివారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు అక్షరాస్యత పెంచాలి. రాష్ట్రంలో త్వరలోనే పేద, ధనిక తేడా లేకుండా అందరికీ రూ.2.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తాం’ అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్