రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం.. చెక్ చేసుకోండి!

856చూసినవారు
రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం.. చెక్ చేసుకోండి!
‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబం ఏడాదికి రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు. అయితే దీనికి అర్హులో కాదో చెక్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఆసుపత్రులను సంప్రదించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఆధార్, రేషన్ కార్డు ఇవ్వాలి. WWW.PMJAY.gov.in లేదా యాప్‌ ద్వారా ప్రాథమిక వివరాలతో అర్హులో కాదో చెక్ చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్