AP: మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా ఈ శిక్షణ అందించబడుతుంది. త్వరలోనే తరగతులు ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు https://apcedmmwd.org/ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 0866-2970567, 7386789966 నంబర్లను సంప్రదించవచ్చు.