AP: ప్రభుత్వం దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు, వినికిడి పరికరాల పంపిణీ కోసం రూ.12 కోట్లు నిధులు విడుదల చేసింది. CM చంద్రబాబు ఆదేశాలతో ఆర్థికశాఖ వెంటనే స్పందించి, మూడు చక్రాల వాహనాల కోసం రూ.5 కోట్లు, వినికిడి పరికరాల కోసం రూ.7 కోట్లు విడుదల చేసింది. తొలి విడతలో 875 త్రిచక్ర వాహనాలు అందించేందుకు సెప్టెంబరులో టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, CM వాటి పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.