AP: విశాఖ జిల్లాలోని బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు శుభవార్త. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకురాలు కే.రాజేశ్వరి తెలిపారు. వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉన్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 100 మందికి రెండు నెలల పాటు శిక్షణ, స్టైఫండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిగ్రీ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 17లోగా ఎంవీపీ కాలనీలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.