AP: ఇంద్ర ధనస్సు’ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు బస్సుల్లో ఏపీఎస్‌ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. మార్చి 18న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. దివ్యాంగులతో పాటు ప్రయాణించే సహాయకుడికి టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ కూడా ఉంటుందని సంస్థ తెలిపింది.