AP: ప్రయాణికులతో బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల పొదిలిలో జరిగిన ఘటనను మరవకముందే, శనివారం కంభం నుంచి అర్థవీడు లోయకు వెళ్లే బస్సులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బస్టాండులోనే నిండిపోయిన బస్సులో ప్రయాణికులు వేచి ఉండగా, చివరి బస్సు కావడంతో అందరూ ఎక్కారు. బస్సులో కండక్టర్ కూడా కదలలేని పరిస్థితి ఏర్పడటంతో డ్రైవర్ బస్సు ఆపి కిందకు దిగిపోయారు. ఈ క్రమంలో ప్రయాణికులకు డ్రైవర్లతో ఘర్షణ జరిగింది.