AP: చిత్తూరు జిల్లా, రామకుప్పం మండలంలోని ఆరిమాణిపెంట గ్రామంలో మహిళలు తాగునీటి సమస్యపై రోడ్డెక్కారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేకపోతున్నారని ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. గత 15 రోజులుగా తమకు తాగునీరు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.